సివిల్ సప్లై వేధింపులు ఆపాలని కోటగిరిలో రైస్ మిల్లర్ల ప్రెస్‌మీట్.
డిసెంబర్ 31 వరకు సీఎంఆర్ చెల్లింపునకు గడువు ఇవ్వాలి.
రైస్ మిల్లర్లపై దాడులు,కేసుల నమోదు తగదు.
కరెంటు,హమాలీ చార్జీల పెంపుతో కుదేలవుతున్న రైస్ మిల్లులు.
67 శాతం టార్గెట్ రీచ్ కావడం లేదన్న మిల్లర్లు.

కోటగిరి/ప్రజావాణి:-రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆదేశాల మేరకు కోటగిరి మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో కోటగిరి,వర్ని,రుద్రూర్,పోతంగల్,చందూర్,మోస్రా మండలా లకు చెందిన ఇంటిగ్రేటెడ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ యూనియన్ల కార్యవర్గ సభ్యులు,మెంబర్స్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు శంకర్ పటేల్, ప్రధాన కార్యదర్శి నిశాంత్ సేట్ మాట్లాడుతూ.ప్రభుత్వంపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని,రైతులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే తాము అన్ని రకాల ధాన్యాన్ని దించుకుంటున్నామని స్పష్టం చేశారు.ప్రస్తుతం వస్తున్న ధాన్యం నాణ్యత తక్కువగా ఉండటం,తడిసిపోవడం వల్ల మిల్లింగ్ సమయంలో నూక శాతం విపరీతంగా పెరుగుతోం దని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం సివిల్ సప్లై ద్వారా 67 శాతం బియ్యాన్ని (సీఎంఆర్) కోరుతున్నప్పటికీ,ప్రస్తుత ధాన్యం నాణ్యతరీత్యా ఆ శాతం సాధించడం సాధ్యం కాదని తెలిపారు.నూకలు,పరం తరుగు పోను తీవ్రమైన షార్టేజ్ ఏర్పడుతోందని పేర్కొన్నారు.సీఎంఆర్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు,ఎఫ్‌సీఐకి చెల్లించడానికి డిసెంబర్ 31 వరకు గడువు ఇవ్వాలని కోరారు.ఆ లోపు బాకీ ఉన్న బియ్యాన్ని పూర్తిగా చెల్లిస్తామని,అప్పటికీ ఇవ్వని వారిపైనే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.మిల్లింగ్‌లో సమస్యలు తలెత్తినప్పుడు మిల్లర్లను దొంగలుగా చిత్రీకరిం చి,కుటుంబ సభ్యులపై కేసులు పెట్టి వేధించడం సరికాదని అన్నారు.అధికారులు భూతద్దం పెట్టి పరీక్షలు చేయడం మాని,సివిల్ సప్లై దాడులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం ఇదే విధంగా వేధింపులకు గురిచేస్తే తామందరం కలిసి రైస్ మిల్లులకు తాళాలు వేసి ప్రభుత్వానికి హ్యాండోవర్ చేస్తామని హెచ్చరించారు.కరెంట్ చార్జీలు,హమాలీ చార్జీలు విపరీతంగా పెరిగినప్పటికీ, ప్రభుత్వాలు మిల్లింగ్ చార్జీలను సకాలంలో చెల్లించడం లేదని తెలిపారు.గోదాముల కొరత వల్ల లారీలు రోజుల తరబడి వెయిటింగ్ చేయాల్సి వస్తోందని,ఈ స్టోరేజ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.ఈ సమావేశంలో ఇంటిగ్రేటెడ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు మహమ్మద్ సిరాజ్,కోశాధికారి ఆన్సర్, వర్కింగ్ ప్రెసిడెంట్ తన్వీర్ హైమద్, జాయింట్ సెక్రెటరీ నిసార్ హైమద్,మెంబర్స్ గణేష్ సేట్,జుబేర్,ఏక్బాల్, మహమ్మద్ సోహెల్,అన్వర్,సాయి రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, వాసు,సునీల్,అక్రమ్ ఖాన్,కరీం అతిక్,లయక్,కూచి సిద్దు, కృష్ణారెడ్డి,అశ్వక్ హైమద్,రౌఫ్,సత్తార్,మమ్మద్,తదితరులు పాల్గొన్నారు.

