📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబడి ఉంది.. పిల్లలూ ఉన్నారు.. మరి 'బయాలజీ' టీచర్ ఎక్కడ

బడి ఉంది.. పిల్లలూ ఉన్నారు.. మరి ‘బయాలజీ’ టీచర్ ఎక్కడ

📰 Generate e-Paper Clip

*బడి ఉంది.. పిల్లలూ ఉన్నారు.. మరి ‘బయాలజీ’ టీచర్ ఎక్కడ?*

 

 

 

 

 

కేసముద్రం జెడ్పీహెచ్‌ఎస్‌లో అంధకారంలో విద్యార్థుల భవిష్యత్తు!

 

 

 

 

 

 

పీడీ మేడమే దిక్కు.. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యానికి పేద విద్యార్థులు బలికావాలా?

 

 

 

 

కేసముద్రం, సెప్టెంబర్ 10 ప్రజావాణి.

 

మా పిల్లల భవిష్యత్తుతో చెలగాటం ఆడకండి.. మా పేదరికాన్ని ఆసరాగా చేసుకుని వారి చదువులను అర్ధాంతరంగా ఆపేయకండి అంటూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యనందిస్తున్నామని గొప్పలు చెప్పుకునే విద్యాశాఖ క్షేత్రస్థాయి వాస్తవాలను ఎందుకు విస్మరిస్తోందని వారు నిలదీస్తున్నారు. ఈ పాఠశాలలో గత రెండు నుంచి మూడు నెలలుగా జీవశాస్త్రం ఉపాధ్యాయుడి పోస్టు ఖాళీగా ఉండటం అధికారుల బాధ్యతారాహిత్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.

 

 

 

 

 

 

 

*పీడీ మేడం చొరవ: బాధ్యత మరిచిన అధికారులకు కనువిప్పు!*

 

 

 

 

 

 

 

 

 

క్లాసులు ఖాళీగా ఉంటుంటే చూడలేక, పిల్లల చదువు ఎక్కడ ఆగమైపోతుందోనన్న ఆవేదనతో ఆ పాఠశాలలో పనిచేస్తున్న పీడీ (శారీరక విద్యా దర్శకురాలు) మేడం తనకున్న విద్యా అర్హతలతో జీవశాస్త్రం బోధిస్తున్నారు. విధి నిర్వహణలో ఆమె చూపిస్తున్న ఈ మానవతా దృక్పథం, చొరవ నిజంగా అభినందనీయం. అయితే, టెన్త్ క్లాస్ బోర్డు పరీక్షలు ఎదుర్కొనే విద్యార్థులకు సబ్జెక్టుపై లోతైన అవగాహన, ప్రత్యేక శిక్షణ ఉన్న సబ్జెక్టు టీచర్ ఉంటేనే న్యాయం జరుగుతుంది. ఒక వ్యాయామ ఉపాధ్యాయురాలితో నెలల తరబడి ప్రధాన సబ్జెక్టులు చెప్పించడం విద్యాశాఖ పరిపాలనా వైఫల్యం కాదా? అని విద్యా మేధావులు ప్రశ్నిస్తున్నారు.

 

 

 

 

 

 

 

*తల్లిదండ్రుల ఆవేదన..కార్పొరేట్ ఫీజులు కట్టలేం.. సర్కారు బడి నమ్మితే నట్టేట ముంచుతారా?*

 

 

 

 

 

పరీక్షల సమయం ముంచుకొస్తున్న తరుణంలో సబ్జెక్టు టీచర్ లేకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.మాకు కార్పొరేట్ స్కూళ్లకు పంపి వేలల్లో ఫీజులు కట్టే స్తోమత లేదు. నమ్మకంతో ప్రభుత్వ బడికి పంపితే, ఇక్కడ ఉపాధ్యాయుల్నే నియమించరా? మా పిల్లలు పెద్ద చదువులు చదవకూడదా? వారి భవిష్యత్తుతో ఆటలాడకండి అని తల్లిదండ్రులు భోరుమంటున్నారు.

గ్రామీణ ప్రాంత విద్యార్థుల కలలను చిదిమేసే హక్కు అధికారులకు ఎవరిచ్చారని వారు ఆక్రోశిస్తున్నారు.విద్యాశాఖ ఉన్నతాధికారులు వెంటనే నిర్లక్ష్యం వీడి, కేసముద్రం పాఠశాల వైపు చూడాలని టీచర్ ని నియామకం చెయ్యాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.