మేడ్చల్ శాసనసభ్యులు, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి 73వ జన్మదిన వేడుకలను మేడ్చల్ లో బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయాల మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో
పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (ప్రభుత్వ ఆసుపత్రి)లో చికిత్స పొందుతున్న రోగులకు పార్టీ నాయకులతో కలిసి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.ఎమ్మెల్యే మల్లారెడ్డి నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని నాయకులు ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిరంతరం ముందుండే ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కో-ఆప్షన్ సభ్యులు ఆకిటి నవీన్ రెడ్డి, పార్టీ నాయకులు సందీప్ గౌడ్,శంకర్, అలీ, రఘుపతి రెడ్డి, విష్ణు చారీ, సుశాంత్ రెడ్డి, ప్రభాకర్, శైలేందర్, దగ్గు పవన్, అవతార్, సంతోష్ తో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఘనంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి జన్మదిన వేడుకలు
RELATED ARTICLES

