సీతారాంపూర్ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత యూనిఫారాల పంపిణీ….
రం
గారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 9. ప్రజావాణి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని సీతారాంపూర్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అందించిన ఉచిత యూనిఫారం పంపిణీ కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో స్థానిక గ్రామ సర్పంచ్ తోపుకొండ పావని చెన్నయ్య. విద్యార్థులకు ఉచిత యూనిఫారాలను అందజేశారు. ప్రభుత్వ0 విద్యార్థులసంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీశైలం. సీసీ మల్లేష్. గ్రామ మహిళా సంఘం అధ్యక్షురాలు నరసమ్మ. రాధిక వి ఏ ఓ. మంగళ. శంకరమ్మ. గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏకాంబరెడ్డి. యాదయ్య. సుప్రసీనారెడ్డి. గ్రామ కాంగ్రెస్ యువజన నాయకుడు. మని చించేట్టి ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..

