📄 ePaper
Epaper 2
Sunday, November 8, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyజోగిపేటలో రూ.3.83 కోట్లతో నూతన ఆర్డీవో  కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ

జోగిపేటలో రూ.3.83 కోట్లతో నూతన ఆర్డీవో  కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ

📰 Generate e-Paper Clip

జోగిపేటలో రూ.3.83 కోట్లతో నూతన ఆర్డీవో  కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ


మన సమగ్ర ప్రజావాణి సెప్టెంబర్ 08 (జోగిపేట ) సంగారెడ్డి జిల్లా ప్రతినిధి


ఆందోల్–జోగిపేట మున్సిపల్ పరిధిలోని తహసీల్దార్ కార్యాలయం వెనుక ఖాళీ ప్రదేశంలో నూతన ఆర్డిఓ కార్యాలయం, రెసిడెన్షియల్ క్వార్టర్స్ నిర్మాణానికి సోమవారం భూమిపూజ నిర్వహించారు.
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్ ఎస్. కృష్ణారెడ్డి కొబ్బరికాయ కొట్టి భూమిపూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొత్తం రూ.3.83 కోట్ల అంచనా వ్యయంతో G+1 భవనంలో ఆర్డీవో  కార్యాలయం, రెసిడెన్షియల్ క్వార్టర్స్ నిర్మించనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు), జగన్ మోహన్ రెడ్డి, సురేందర్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య, తహసీల్దార్ మధుకర్ రెడ్డి, కౌన్సిలర్లు కోషికే రాజశేఖర్, మర్రి అరుణకుమారి, పలువురు మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్ అండ్ బి  అధికారులు డి ఈ  రవీందర్, ఏఈ శశాంక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.