📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddy1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ నిరసన

1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ నిరసన

📰 Generate e-Paper Clip

1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ నిరసన

మన సమగ్ర ప్రజావాణి సెప్టెంబర్ 08 (జోగిపేట )సంగారెడ్డి జిల్లా ప్రతినిధి

కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీఓకు వినతిపత్రాలు సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్ నాయకులు ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి, 1000 రోజులు గడిచినా అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. ప్రజా సమస్యలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
కార్యక్రమంలో మాజీ డీసీసీబీ వైస్ చైర్మన్ పి. జైపాల్ రెడ్డి, మాజీ ఏఎంసి చైర్మన్లు పి. నారాయణ ముదిరాజ్, డి.బి. నాగభూషణం, మాజీ ఎంపీపీలు రామ గౌడ్, జె. బాలయ్య, కౌన్సిలర్లు పట్లూరి శివ శేఖర్, నాగరత్నం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.