📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్అదుపుతప్పి రాళ్ల కుప్పపైకి దూసుకెళ్లిన బైక్.. వ్యక్తికి గాయాలు

అదుపుతప్పి రాళ్ల కుప్పపైకి దూసుకెళ్లిన బైక్.. వ్యక్తికి గాయాలు

📰 Generate e-Paper Clip

బెజ్జంకి–బేగంపేట రోడ్డుపై బైక్ అదుపుతప్పి ప్రమాదం

బెజ్జంకి, సెప్టెంబర్ 6 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరుకు చెందిన జక్కం సత్తయ్య రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. బెజ్జంకిలో బంధువుల అంత్యక్రియలకు హాజరై అనంతరం ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.బెజ్జంకి–బేగంపేట రహదారిపై హాస్టల్ సమీపంలో రాళ్ల కుప్ప ఉండటంతో సత్తయ్య ప్రయాణిస్తున్న ఎక్స్‌ఎల్‌ బైక్ అదుపుతప్పి రాళ్ల కుప్పపైకి దూసుకెళ్లి కిందపడిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి.
గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించి, చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.