పాత బిల్లుల విడుదలకై ప్రజావాణిలో మాజీ సర్పంచ్ వినతి.
కోటగిరి/ప్రజావాణి:-తాను చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ కోటగిరి మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్ సోమవారం మండల కేంద్రంలో జరిగిన ప్రజావాణిలో సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. 2018–2024 పదవీ కాలంలో కోటగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిహెచ్సి భవనం రిపేర్లు,డ్రెయినేజీల పారిశుధ్య పనులను సొంత ఖర్చులతో పూర్తి చేశానని,వీటి నిమిత్తం పంచాయతీలో తీర్మానాలు చేసి ఎంబి రికార్డు నమోదు చేసినట్లు తెలిపారు.స్పెషల్ ఆఫీసర్ పాలన బాధ్యతలు స్వీకరించినప్పుడు కూడా ఈ రికార్డులను వారికి అప్పగించి నట్లు చెప్పారు.అయితే ఈ నిధులు రాకపోవడంతో బిల్లుల చెల్లింపు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుతం నూతనంగా ఎన్నికైన సర్పంచ్ రాజకీయ కక్షతోనే తన బిల్లులను నిలిపివేశారని ఆరోపించారు.అధికారులు వెంటనే స్పందించి ఈ ఎంబి రికార్డులు,తీర్మానాలను పరిశీలించి నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం ద్వారా కోరామని అన్నారు.

