బెజ్జంకి, ఆగష్టు 24(ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామ ప్రభుత్వ పాఠశాలలో సుమారు 100 మంది విద్యార్థులకు స్టీల్ భోజన ప్లేట్లు, గ్లాసులను సోమవారం పంపిణీ చేశారు.కేడిక నాగరాణి–బాల్రెడ్డి దాతల సహకారంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ విద్యార్థుల అవసరాలను గుర్తించి భోజన ప్లేట్లు, గ్లాసులు అందించిన దాతలు కేడిక నాగరాణి–బాల్రెడ్డికి అభినందనలు తెలిపారు. విద్యార్థుల సంక్షేమానికి దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దుగ్యాని లావణ్య, వార్డు సభ్యులు పోతు భూలక్ష్మి, కొంకటి సంపత్, కొంకటి కుమార్, కొంకటి సురేష్, హెడ్మాస్టర్ మమత గౌతమి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

