మగ్ధుంపూర్లో ఘనంగా పోచమ్మ దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవం
నంగునూరు, ఆగస్టు 23: నంగునూరు మండలం మగ్ధుంపూర్ గ్రామంలో శ్రీ పోచమ్మ దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి హాజరయ్యారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని, గ్రామ ప్రజలపై శ్రీ పోచమ్మ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. వర్షం సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసే పాడిపంటలు బాగా పండాలన్నారు. గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఐకమత్యంతో నిర్వహించడం అభినందనీయమన్నారు.
ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించడంతో పాటు భక్తుల కోసం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో గ్రామస్థులు, భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో సర్పంచ్ పాకాల శ్రీనివాస్, అచ్చిన సత్తయ్య,ఎనగందుల యాదగిరి, జాప తిరుపతి, రాగుల కనకయ్య, మరియు,ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

