📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadతొర్రూరు పట్టణ కేంద్రంలో ఘనంగా ఝాన్సీ రెడ్డి జన్మదిన వేడుకలు

తొర్రూరు పట్టణ కేంద్రంలో ఘనంగా ఝాన్సీ రెడ్డి జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

తొర్రూరు పట్టణ కేంద్రంలో ఘనంగా ఝాన్సీ రెడ్డి జన్మదిన వేడుకలు

 

జనహృదయురాలుకు జన్మదిన వేడుకలు తొర్రూరు డివిజన్ కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
మంగళవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోత్కూరి రవీంద్ర చారి,పట్టణ అధ్యక్షుడు ముద్దసాని సురేష్ ఆధ్వర్యంలో డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు,పండ్లు పంపిణీ చేశారు. అనంతరం విశ్రాంతి భవనంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పింగిలి ఉష ఆధ్వర్యంలో ముస్లిం అనాధ ఆశ్రమంలో నిరుపేద పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి, ఆశ్రమంలోని పిల్లలందరికీ అన్నదానం చేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ మూడు దశాబ్దాల కాలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో, అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి, ప్రజల మన్ననలు పొందారని గుర్తు చేశారు. ఆనాటి నుండి నేటి వరకు పాలకుర్తి నియోజకవర్గ మే ఒక దేవాలయం ప్రజలే ఆమె దేవుళ్ళుగా భావించి, పాలకుర్తి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే బరిలో దిగడం జరిగిందని ఆయన తెలిపారు, వారి సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించిన పాలకుర్తి ప్రజలు కుటుంబానికి ఎమ్మెల్యే పదవిని ప్రసాదించి పట్టం కట్టారు. నియోజకవర్గంలో ఝాన్సీ రెడ్డి సారధ్యంలో దిశా నిర్దేశంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నాయకత్వంలో తొర్రూరు మండలం అన్ని విధాల అభివృద్ధి చెందబోతుందని ఆయన ఆకాంక్షించారు.
భవిష్యత్తులో కూడా ఝాన్సీ రెడ్డి ఆయురారోగ్యాలతో, సకల సౌభాగ్యాలతో, సుఖ సంతోషాలతో నిండా నూరేళ్లు ప్రజాసేవలో ఉండి ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు మున్సిపల్ వైస్ చైర్మన్ సోమ రజిని రాజశేఖర్, కౌన్సిలర్ చాపల బాపురెడ్డి, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ పోనుగోటి సోమేశ్వరరావు,గంజి విజయపాల్ రెడ్డి,అచ్చిరెడ్డి, సధాకర్,గుండాల నర్సయ్య, పేరటి యాకుబ్ రెడ్డి, రామ్ రెడ్డి,జాటోత్ రవి నాయక్,బిక్షం గౌడ్,ఇంద్రసేనారెడ్డి,వెంకట్ రెడ్డి జక్కా, మహబూబ్ రెడ్డి,బంగారు రమేష్, శ్రీను నాయక్,మై పాషా,రమేష్ గౌడ్, నరేష్ రెడ్డి, దొంగరి శంకర్, సోమిరెడ్డి, వెలుగు మహేశ్వరి, పంజా కల్పన, అనిల్, ,దేవేందర్ రాజు, రామచంద్రయ్య, ప్రభాకర్ రెడ్డి, అశోక్ రెడ్డి,చిదిరాల రవి, మహేష్ యాదవ్, తాళ్లపల్లి రమేష్ ,
,ఎర్రం రాజు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.