📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyపోతుగల్ గ్రామంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పోతుగల్ గ్రామంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip


పోతుగల్, ఆగస్టు 15: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని పోతుగల్ గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట గ్రామ సర్పంచ్ పామెన నర్సింలు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ పామెన నర్సింలు మాట్లాడుతూ.. యువత, చిన్నారులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమరయోధులను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి యువజన సంఘం, పాఠశాల, గ్రామంలోని ప్రధాన కూడళ్ల వద్ద స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నేరెట్ల సావిత్రి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ కార్యదర్శి అశోక్, అంగన్వాడీ టీచర్ ఆశ, అంగన్వాడీ వర్కర్, గ్రామ యువజన సంఘం సభ్యులు, యువకులు, నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ గ్రామ సర్పంచ్ పామెన నర్సింలు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.