📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyబీసీ సేన జిల్లా కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

బీసీ సేన జిల్లా కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

బీసీ సేన జిల్లా కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలి:బీసీ సేన రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సదర్ శ్రీను

దేశాభివృద్ధిలో ప్రతి పౌరుడి పాత్ర కీలకం: బీసీ సేన

షాద్‌నగర్ పట్టణంలోని బీసీ సేన రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సేన రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సదర్ శ్రీను జాతీయ జెండాను ఆవిష్కరించి జెండాకు వందనం చేశారు.ఈ సందర్భంగా సదర్ శ్రీను మాట్లాడుతూ, ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగా భారతదేశానికి రాజ్యాంగం లభించిందని అన్నారు. దేశ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛలు, సమానత్వాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ నీతి, నిజాయితీతో సమాజంలో మెలగాలని పిలుపునిచ్చారు.దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో బీసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు వరప్రసాద్, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి, షాద్‌నగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి జయ శ్రీకాంత్, షాద్‌నగర్ టౌన్ అధ్యక్షురాలు సరస్వతి, ఉపాధ్యక్షురాలు పద్మ, నందిగామ మండల అధ్యక్షుడు అగ్గి మహేష్, మూడవ వార్డు అధ్యక్షురాలు బాలమణి, నాలుగో వార్డు అధ్యక్షురాలు అనసూయ, వరుణ్, అనిల్, మారుతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.