📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణPeddapalliఘనంగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ జన్మదిన వేడుకలు

ఘనంగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

 

గోదావరిఖని: రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ జన్మదిన వేడుకలను రామగుండం గురుకుల కళాశాలలో పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులకు తాగునీటి సదుపాయం కోసం 1000 లీటర్ల వాటర్ ట్యాంక్‌ను అందించడంతో పాటు 583 మంది విద్యార్థులకు పెన్నులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రామగుండం గురుకుల కళాశాల విద్యార్థుల భవిష్యత్తు కోసం, నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలను అధిరోహించి ప్రజలకు సేవ చేయాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ తేజస్విని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, గురుకుల కళాశాల పేరెంట్స్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కవ్వంపెల్లి సతీష్, ఎస్వీపీ రజిత, జెవీపీ రజిత, పేరెంట్స్ కమిటీ చైర్మన్ కన్నం నవీన, వైస్ చైర్మన్ శైలజ, సలహాదారులు దుర్గం ఉషారాణి, మురళి, మాధవి, కన్నం సంపత్, ప్రధాన కార్యదర్శి సంధ్యారాణి, కోశాధికారి రజిత, కార్యదర్శులు ప్రియాంక, అంజలి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

అలాగే కళాశాల ఉపాధ్యాయులు, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Previous article
Next article
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.