📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriవెల్డింగ్ వైర్ చోరీకి యత్నం.. స్థానికుల చాకచక్యంతో పట్టుబడ్డ నిందితుడు... అరెస్టు చేసి రిమాండ్...

వెల్డింగ్ వైర్ చోరీకి యత్నం.. స్థానికుల చాకచక్యంతో పట్టుబడ్డ నిందితుడు… అరెస్టు చేసి రిమాండ్ కు తరలింపు

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, ఆగస్టు 12 (ప్రజా వాణి): ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏ.వి. మధురానగర్‌లో వెల్డింగ్ వైర్ చోరీకి యత్నించిన వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన చోటుచేసుకుంది. వర్క్‌షాప్‌లో సుమారు 25 కిలోల వెల్డింగ్ వైర్‌ను అపహరించేందుకు ప్రయత్నించిన జలపాటి రవి (37)ని స్థానికులు పట్టుకోవడంతో చోరీ యత్నం విఫలమైంది.

స్థానికుల వివరాల ప్రకారం.. ఏ.వి. మధురానగర్‌లోని ఓ వర్క్‌షాప్‌లో వెల్డింగ్‌కు ఉపయోగించే వైర్‌ను చోరీ చేసేందుకు జలపాటి రవి ప్రయత్నించినట్లు తెలిసింది. అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న అతడిని గమనించిన స్థానికులు అప్రమత్తమై పట్టుకున్నారు. అనంతరం ఘట్‌కేసర్ పోలీసులకు సమాచారం అందించి నిందితుడిని వారి చేతికి అప్పగించారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చోరీకి ఉపయోగించిన వస్తువులు, చోరీకి యత్నించిన విధానంపై పోలీసులు వివరాలు సేకరించారు. ఘటనకు సంబంధించి వర్క్‌షాప్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో జలపాటి రవి చోరీకి పాల్పడేందుకు ప్రయత్నించినట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

స్థానికుల అప్రమత్తతతో సుమారు 25 కిలోల వెల్డింగ్ వైర్ చోరీకి గురికాకుండా అడ్డుకున్నారని పోలీసులు తెలిపారు. వర్క్‌షాప్‌లు, దుకాణాల పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.