వెల్డింగ్ వైర్ చోరీకి యత్నం.. స్థానికుల చాకచక్యంతో పట్టుబడ్డ నిందితుడు… అరెస్టు చేసి రిమాండ్ కు తరలింపు
ఘట్‌కేసర్, ఆగస్టు 12 (ప్రజా వాణి): ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏ.వి. మధురానగర్‌లో వెల్డింగ్ వైర్ చోరీకి యత్నించిన వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన చోటుచేసుకుంది. వర్క్‌షాప్‌లో సుమారు 25 కిలోల వెల్డింగ్ వైర్‌ను అపహరించేందుకు ప్రయత్నించిన జలపాటి రవి (37)ని స్థానికులు పట్టుకోవడంతో చోరీ యత్నం విఫలమైంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఏ.వి. మధురానగర్‌లోని ఓ వర్క్‌షాప్‌లో వెల్డింగ్‌కు ఉపయోగించే వైర్‌ను చోరీ చేసేందుకు జలపాటి రవి ప్రయత్నించినట్లు తెలిసింది. అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న అతడిని గమనించిన స్థానికులు అప్రమత్తమై...