రైతులను మోసం చేస్తే చర్యలు తప్పవు

కొంతమంది మండి వ్యాపారస్తులపై మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్
బల్లా పల్లవి ఆగ్రహం
అనంతపురం బ్యూరో ఆగస్టు 06 ప్రజావాణి
కాటా వద్ద కొంత మంది
మండి వ్యక్తులు నిలబడి రైతులను తమ మండికి రావాలని, డబ్బులు ఎక్కువగా ఇస్తామని చెప్పి చివరికి మోసం చేస్తున్నారని మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ బల్లా పల్లవి పేర్కొన్నారు. గురువారం అనంతపురం నగర సమీపంలో ఉన్న మార్కెట్ యార్డ్ ను పరిశీలించి కొంతమంది మండి వ్యక్తుల రైతులను మోసం చేస్తున్నారని ఫిర్యాదులు అందడంతో చైర్ పర్సన్ బల్లా పల్లవి కొంతమంది మండి వ్యక్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విషయంపై రైతుల నుంచి వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇదే సమస్య గురించి ఇప్పటికే మూడోసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. రైతులు తమకు నచ్చిన మండికి వెళ్లి, తమ సరుకును అమ్ముకుంటారు. ఇకపై ప్రతిరోజూ సాయంత్రం సమయంలో తప్పనిసరిగా మైక్ ద్వారా ప్రకటన చేయాలి. రైతులు తమకు నచ్చిన మండికి వెళ్లి తమ సరుకును అమ్ముకునే స్వేచ్ఛ కలిగి ఉంటారు. ఎవరూ రైతులను బలవంతం చేయకూడదు లేదా తప్పుదారి పట్టిస్తే మండి వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని చైర్ పర్సన్ బల్లా పల్లవి
హెచ్చరించారు.




