నర్సాపురం (ఆగస్టు 4 ప్రజావాణి )కూటమి ప్రభుత్వం పేదలకు దళితులకు భూ పంపిణీ అమలు చేస్తామని ఎన్నికలలో వాగ్దానాలు అమలు చేశారు ప్రభుత్వ ఏర్పడి రెండు సంవత్సరాలైనా భూ పంపిణీ అమలు చేయలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి అన్వేష్ అన్నారు.కార్యాలయం వద్ద మండలంలోని నిరుపేదలకు దళితులకు భూ పంపిణీ అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ ఇటుకలపాడు సావిశెట్టిపల్లె కత్తెర గండ్ల నాయన పల్లె మూలపల్లె రెవెన్యూ గ్రామాలలో వందల ఎకరాలు రాజకీయ పలుకుబడి కలిగిన వారికి స్థానికేతర్లకు ఎస్టేట్లో నిర్మించుకున్నారు.ఆ ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులకే పరిమితమైనది. ఒక్క ఎకరం భూమి కూడా రెండు సంవత్సరాలో భూ కబ్జాదాల వద్ద నుంచి స్వాధీనం చేసుకోలేదన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం భూ కబ్జాదాల నుంచి స్వాధీనం చేసుకొని స్థానిక నిరుపేదలు దళితులకు రెండు ఎకరాలు చొప్పున భూ పంపిణీ అమలు చేయాలని అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మిద్దెల గ్రామం దళితులకు కేటాయించిన స్మశాన స్థలాన్ని అగ్రవర్ణాలు కబ్జా చేశారు. స్థలాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకొని పరిరక్షించాలని కోరారు.కెన్ కొట్టాల గ్రామం దళితుల స్మశానాన్ని రెండు ఎకరాలు భూమిని స్థానిక అగ్రవర్ణాలు కబ్జా చేశారు వెంటనే చట్టపరమైన కేసులు నమోదు చేసి ఆ భూమిని స్వాధీనం చేసుకొని ప్రహరీ గోడ నిర్మించాలన్నారు.నాయన పల్లె గ్రామం స్మశానం స్థలం లేక పొలాల గేట్ల వద్దనే చనిపోయిన వారిని పూడ్చుకుంటున్నారు.కాబట్టి స్మశానాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వరి కుంట్ల గ్రామం దిగువారిజనవాడకు చెందిన స్మశాన స్థలాన్ని దొంగ పట్టాలు సృష్టించుకుని దౌర్జన్యంగా స్మశాన స్థలంని కంచ వేశారు వెంటనే రెవెన్యూ అధికారులు పరిశీలించి స్వాధీనం చేసుకోవాలని కోరారు. కేఎన్ కొట్టాలా గ్రామం దళిత కాలనీకి సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయాలని స్థానిక ఎంపీడీవో రమాదేవి కి వినతి పత్రం సమర్పించారు.స్మశాన స్థలాలు, ప్రభుత్వ భూములు కబ్జాదాలపై చర్యలు తీసుకోవాలని భూ పంపిణీ అమలు చేయాలని ధర్నా అనంతరం,తాహసిల్దారు రాజేష్ కృష్ణ కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు వరికుంట్ల బాబు మండల ప్రధాన కార్యదర్శి గుండ్ల కుంట కిరణ్ మండల ఉపాధ్యక్షులు ఓబులాపురం ఓబయ్య సుమన్ భాస్కర్ నారాయణ జీవన్ పూజారి అభి బాల ఓబయ్య లక్ష్మయ్య తదితలు పాల్గొన్నారు.




