ప్రజావాణి శాయంపేట
మండలం గట్లకనిపర్తి గ్రామంలోని రెండు రైస్ మిల్లుల్లో ప్రభుత్వానికి చెందిన కస్టమ్ మిల్లింగ్ రైస్ సిఎంఆర్ ధాన్యం అక్రమంగా దారి మళ్లించిన కేసులో ఇద్దరు రైస్ మిల్లు యజమానులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది.
శాయంపేట పోలీస్ స్టేషన్‌లో నమోదైన సి ఆర్ నెంబర్.136/2026 కేసులో లక్ష్మీ నరసింహ రైస్ మిల్లు యజమాని చౌళ్ళ లక్ష్మణ్‌రావు గ్రామం నర్సింహులపల్లి శాయంపేట మండలం , మరియు సి ఆర్ నెంబర్.137/2026 కేసులో శ్రీ వినాయక ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని పెంచాల కిరణ్ కరీమాబాదు వీరిని పరకాల ఏసీపీ సి. సతీష్ బాబు నేతృత్వంలో అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పరకాల న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది.
పోలీసుల వివరాల ప్రకారం, ప్రభుత్వం ఐకేపీ కేంద్రాల ద్వారా సేకరించిన వరి ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం రైస్ మిల్లులకు అప్పగిస్తుంది. మిల్లింగ్ అనంతరం ఉత్పత్తి చేసిన బియ్యాన్ని ప్రభుత్వానికి తిరిగి అందజేయాల్సి ఉండగా, సంబంధిత మిల్లు యాజమానులునిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా దారి మళ్లించి భారీ ఆర్థిక నష్టం కలిగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.లక్ష్మీ నరసింహ రైస్ మిల్లులో 15,318.41 టన్నుల ధాన్యం కొరత ఉండగా, దీని విలువ సుమారు రూ.4.42 కోట్లకు పైగాగా గుర్తించారు. అలాగే శ్రీ వినాయక ఆగ్రో ఇండస్ట్రీస్‌లో 15,969.87 టన్నుల ధాన్యం కొరత ఉండగా, దీని విలువ రూ.4.61 కోట్లకు పైగాగా అంచనా వేశారు.
ప్రభుత్వానికి చెందిన సిఎంఆర్ ధాన్యాన్ని అక్రమంగా దారి మళ్లించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు కొనసాగుతాయని శాయంపేట పోలీసులు తెలిపారు.
గట్లకనిపర్తి రైస్ మిల్లులలో సిఎంఆర్ ధాన్యం అవకతవకలుఇద్దరు రైస్ మిల్లు యజమానులు అరెస్ట్ కోర్టుకు రిమాండ్
RELATED ARTICLES




