📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణPeddapalliఆర్జీ-2 జీఎం లక్ష్మీపతి గౌడ్‌కు ఘన సన్మానం

ఆర్జీ-2 జీఎం లక్ష్మీపతి గౌడ్‌కు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

 

శుభాకాంక్షలు తెలిపిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, ఆలయ ఫౌండేషన్ ప్రతినిధులు.

గోదావరిఖని ఆగస్టు 3 ప్రజావాణి :

సింగరేణి కాలరీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా, నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆర్జీ-2 జీఎం లక్ష్మీపతి గౌడ్ ని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, ఆలయ ఫౌండేషన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆలయ ఫౌండేషన్ డిప్యూటీ సీఈవో మిట్టపల్లి రాజేందర్ కుమార్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ ల ఆధ్వర్యంలో ఆర్జీ-2 జీఎం కి పూల బొకే అందించి, శాలువాతో ఘనంగా సత్కరించి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. లక్ష్మీపతి గౌడ్  మునుముందు మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. అనంతరం నరహరి ఐఏఎస్ రచించిన “ఓబీసీ పోరుబాట” పుస్తకాన్ని జీఎం కి బహుకరించారు.

ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం పెద్దపల్లి జిల్లా కో-కన్వీనర్ ఆకునూరి బాలంకూస్, సభ్యులు మూగల మహేష్, పాణిగంటి రాజలింగు, గడమల్ల రాకేష్, బొచ్చు శంకర్, మరియు ఎస్ అండ్ పీసీ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి అరుకాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.