📄 ePaper
Monday, August 3, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్మదర్ థెరెసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవయవ దాన అవగాహన పోస్టర్ విడుదల

మదర్ థెరెసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవయవ దాన అవగాహన పోస్టర్ విడుదల

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల (ఆగస్టు 3 ప్రజావాణి)జాతీయ అవయవ దాన దినోత్సవాన్ని పురస్కరించుకొని మదర్ థెరెసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవయవ దానంపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో రూపొందించిన ప్రత్యేక పోస్టర్‌ను బద్వేల్ శాసనసభ్యులు డాక్టర్ దాసరి సుధమ్మ చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధమ్మ మాట్లాడుతూ,”అవయవ దానం అనేది ఒక మహోన్నత మానవతా సేవ. ప్రతి ఒక్కరూ అవయవ దానం పట్ల అవగాహన పెంపొందించుకొని, జీవితాలను కాపాడే ఈ గొప్ప నిర్ణయంలో భాగస్వాములు కావాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను”అని అన్నారు. మదర్ థెరెసా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ చిత్తా రవి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, “మరణానంతరం కూడా మన అవయవాలు మరొకరికి కొత్త జీవితాన్ని అందించగలవు. ఒక అవయవ దాత ఎనిమిది మంది వరకు ప్రాణాలను కాపాడగలడు.ప్రతి ఒక్కరూ అవయవ దాన ప్రతిజ్ఞ చేసి,ఒక దాత ఎన్నో ప్రాణాలకు ఆశ’ అనే సందేశాన్ని ప్రతి ఇంటికి చేరవేద్దాం”అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బద్వేల్ మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ కల్లూరు రమణారెడ్డి, పోరుమామిళ్ల జడ్పీటీసీ ముత్యాల ప్రసాద్, మదర్ థెరెసా ఫౌండేషన్ కో-చైర్మన్ చిత్తా గిరి ప్రణీత్ రెడ్డి, పోరుమామిళ్ల మండల వైస్ ప్రెసిడెంట్ సి.భాష,యోగానంద తదితర నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular