మదర్ థెరెసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవయవ దాన అవగాహన పోస్టర్ విడుదల
పోరుమామిళ్ల (ఆగస్టు 3 ప్రజావాణి)జాతీయ అవయవ దాన దినోత్సవాన్ని పురస్కరించుకొని మదర్ థెరెసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవయవ దానంపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో రూపొందించిన ప్రత్యేక పోస్టర్‌ను బద్వేల్ శాసనసభ్యులు డాక్టర్ దాసరి సుధమ్మ చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధమ్మ మాట్లాడుతూ,"అవయవ దానం అనేది ఒక మహోన్నత మానవతా సేవ. ప్రతి ఒక్కరూ అవయవ దానం పట్ల అవగాహన పెంపొందించుకొని, జీవితాలను కాపాడే ఈ గొప్ప నిర్ణయంలో భాగస్వాములు కావాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను"అని అన్నారు. మదర్ థెరెసా...