📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఆగస్టు 9న ఘనంగా బోనాల సంబరాలు... శివారెడ్డిగూడ, మారుతీనగర్, శ్రీనిధి నెస్ట్ కాలనీల పెద్దల ఏకగ్రీవ...

ఆగస్టు 9న ఘనంగా బోనాల సంబరాలు… శివారెడ్డిగూడ, మారుతీనగర్, శ్రీనిధి నెస్ట్ కాలనీల పెద్దల ఏకగ్రీవ నిర్ణయం

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్, ఆగస్టు 2: మేడ్చల్–మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని శివారెడ్డిగూడ, మారుతీనగర్, శ్రీనిధి నెస్ట్ కాలనీలలో ఈ నెల 9వ తేదీన బోనాల మహోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కాలనీల పెద్దలు ఏకగ్రీవంగా నిర్ణయించారు.

ఆదివారం నిర్వహించిన సమావేశంలో బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లు, భక్తులకు అవసరమైన సౌకర్యాలపై విస్తృతంగా చర్చించి పలు తీర్మానాలు చేశారు. మూడు కాలనీల ప్రజలంతా భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సంప్రదాయబద్ధంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో బోనాల పండుగను నిర్వహించాలని, ప్రతి కుటుంబం సహకరించి సామూహికంగా పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కాలనీల పెద్దలు కోరారు.

ఈ సమావేశంలో కంది ప్రవీణ్ కుమార్, మడిపడిగె ఆంజనేయులు, మడిపడిగె రాజ్‌కుమార్, లంబ శ్రీనివాస్ యాదవ్, మెడబోయిన సంజీవ్ ముదిరాజ్, వై. నితిన్ రెడ్డి, జి. సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.