📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్సింగరేణిలో సుదీర్ఘ సేవలు

సింగరేణిలో సుదీర్ఘ సేవలు

📰 Generate e-Paper Clip

సింగర్ అధికారుల పదవి విరమణ వేడుక ఘనం

జీఎం మదన్ మోహన్, డిజీఎం అజాజుల్ల ఖాన్‌లకు ఘన సన్మానం

ముఖ్య అతిథిగా హాజరైన ఎస్టిపిపి ఈడి సిహెచ్. చిరంజీవి

*పాల్గొన్న సింగరేణి ఉన్నతాధికారులు, కార్మిక సంఘాల నాయకులు

జైపూర్,జూలై31, ప్రజావాణి:

సింగరేణి సంస్థ అభివృద్ధిలో దశాబ్దాల పాటు అంకితభావంతో పనిచేసి, సంస్థ ప్రగతికి తోడ్పడిన ఇద్దరు ఉన్నతాధికారుల పదవీ విరమణ వేడుక ఎస్టిపిపి (STPP) పరిపాలనా భవనంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో అత్యంత వైభవంగా జరిగింది. సింగరేణిలో 38 సంవత్సరాల పాటు వివిధ ఏరియాలలో సేవలు అందించి, జనరల్ మేనేజర్ (పిసిఎస్ & ఓ అండ్ ఎం) గా పదవీ విరమణ పొందుతున్న ఎం. మదన్ మోహన్, అలాగే సివిల్ విభాగంలో 37 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలు అందించి డిజీఎం(సివిల్)గా విరమణ పొందుతున్న అజాజుల్ల ఖాన్‌లను ఎస్టిపిపి అధికారులు, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు.

శేష జీవితం ఆనందంగా గడపాలి: ఈడి చిరంజీవి* 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్టిపిపి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడి) సిహెచ్. చిరంజీవి మాట్లాడుతూ.. సింగరేణి లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు నిష్కళంకమైన సేవలు అందించడం సాధారణ విషయం కాదన్నారు. పదవీ విరమణ పొందుతున్న జీఎం మదన్ మోహన్, డిజీఎం అజాజుల్ల ఖాన్‌లకు ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. బాధ్యతల నుంచి విరమణ పొందిన అనంతరం వారి శేష జీవితం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

*ప్లాంట్ నిర్మాణంలో మదన్ మోహన్ క్రియాశీలక పాత్ర* 

ఈ సందర్భంగా తోటి అధికారులు జీఎం మదన్ మోహన్ తో తమకున్న అనుబంధాన్ని, పని అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (STPP) నిర్మాణ సమయంలో ఆయన అందించిన సేవలు మరువలేనివన్నారు. ముఖ్యంగా బిటిజి(BTG) ప్యాకేజీ కింద నిర్మాణ పనులను పర్యవేక్షిస్తూ, ప్లాంట్‌ను కమర్షియల్ ఆపరేషనల్లోకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. యాష్ ఇంచార్జ్‌గా వంద శాతం బూడిద వినియోగాన్ని సాధించడంలో, ఎఫ్జీడీ (FGD) పనులను వేగవంతం చేయడంలో మరియు జీఎం (ఓ&ఎం)గా ప్లాంట్ మరమ్మత్తులను సత్వరమే పూర్తి చేయడంలో ఆయన చూపిన చొరవ అమోఘమని పేర్కొన్నారు.

*సబ్ ఓవర్సీర్ నుండి డిజీఎంగా..* అజాజుల్ ఖాన్ స్ఫూర్తిదాయక ప్రస్థానం

డిజీఎం అజాజుల్ల ఖాన్ సేవల గురించి అధికారులు మాట్లాడుతూ.. ఆయన సింగరేణిలో ఒక సాధారణ సబ్ ఓవర్సీర్‌గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి, అంతర్గత పరీక్షల ద్వారా ఉన్నతాధికారిగా ఎదిగిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. సివిల్ విభాగంలో ఆయన భూపాలపల్లిలో 1000 డీ-టైప్ క్వార్టర్లు, మణుగూరులో 500 ఎంసి-టైప్ క్వార్టర్ల నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారన్నారు. ఎస్టిపిపిలో ఎఫ్జీడీ ప్రాజెక్ట్ సివిల్ పనులను 90 శాతం పూర్తి చేయడంతో పాటు, స్విమ్మింగ్ పూల్, రామాయణ నిర్మాణ పనుల్లో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. సీఎస్ఆర్ (CSR) నిధుల కింద పరిసర గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ పనులను 100 శాతం నాణ్యతతో పూర్తి చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.

*ఆత్మీయ సన్మానం – ప్రముఖుల హాజరు* 

అనంతరం అధికారులు, ఉద్యోగులు కలిసి మదన్ మోహన్, అజాజుల్ల ఖాన్‌లను శాలువాలతో ఘనంగా సత్కరించి, పూలమొక్కలు, జ్ఞాపికలను అందజేశారు.

ఈ ఆత్మీయ వీడ్కోలు మహోత్సవంలో ఎస్టిపిపి జీఎం ఎం. నరసింహ రావు, ఏఐటియుసి పిట్ సెక్రెటరీ సిహెచ్ సత్యనారాయణ, సిఎంఓఎఐ బ్రాంచ్ ప్రెసిడెంట్ డి. పంతులా, ఎజిఎంలు సూర్యనారాయణ రాజు, వివి సుధాకర్ రెడ్డి, బి. శ్రీధర్, డిజీఎంలు మహేందర్, జనగామ శ్రీనివాస్, రాము, పర్సనల్ విభాగాధిపతి ఎస్వి రాజేశ్వర్ రావు, ఎస్వో టు ఈడి వెంకటయ్య, ఎస్వో టు జీఎం శంకర్ తో పాటు పెద్ద సంఖ్యలో అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.