📄 ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
HomeతెలంగాణRangareddyజిల్లేడు చౌదర్‌గూడలోనే పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి

జిల్లేడు చౌదర్‌గూడలోనే పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి

📰 Generate e-Paper Clip

జిల్లేడు చౌదర్‌గూడలోనే పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి

డీఐజీకి వినతిపత్రం అందజేసిన జేఏసీ నాయకులు

–ప్రజాభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి

రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదర్‌గూడ పోలీస్ స్టేషన్‌ను మండల కేంద్రంలోనే ఏర్పాటు చేసి, ఇతర ప్రాంతానికి తరలించవద్దని కోరుతూ జేఏసీ నాయకులు డీఐజీకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మచ్చ సుధాకర్ రావు, సయ్యద్ హఫీజ్, పడకంటి వెంకటేష్ మాట్లాడుతూ, జిల్లేడు చౌదర్‌గూడకు ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉందని, ఇది వ్యాపార, విద్యా, బ్యాంకింగ్ సేవలకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ఇలాంటి ప్రాంతం నుంచి పోలీస్ స్టేషన్‌ను తరలించడం ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
పోలీస్ స్టేషన్‌ను తరలించడం వల్ల ప్రజల శాంతిభద్రతలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని, నూతన మండల కేంద్రంగా జిల్లేడు చౌదర్‌గూడ అభివృద్ధి చెందే అవకాశాలు దెబ్బతింటాయని అన్నారు. ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని అధికారులను కోరారు.
ప్రజల ప్రయోజనాలు, ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పోలీస్ స్టేషన్‌ను జిల్లేడు చౌదర్‌గూడ మండల కేంద్రంలోనే కొనసాగించాలని డీఐజీని వినతిపత్రం ద్వారా విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు మచ్చ సుధాకర్ రావు, సయ్యద్ హఫీజ్, పడకంటి వెంకటేష్తో పాటు పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular