మిత్రమా.! నీ జ్ఞాపకాలను మరువలేం..
క్లాస్ మెంట్ కుటుంబానికి రూ.70 వేలు అందజేత
ప్రజావాణి,ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో 1998-99 టెన్త్ బ్యాచ్ కి చెందిన దత్తడపల్లి సురేష్ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశాడు.సురేష్ స్వగ్రామం మంగపేట.విషయం తెలుసుకున్న నాటి క్లాస్ మెంట్స్ గంజి అశోక్,ఎనమల మురళి,జడల సంపత్,కూటికంటి సంపత్,వద్దిరాజు నగేష్,వద్దిరాజు శంకర్, సర్పంచి తమ్మడపల్లి కుమార్,నరెడ్ల రమేష్,బొల్లోజు ప్రభాకరా చారి,చారు రాధిక,బొమ్మోజు రమాదేవి,సింగంశెట్టి రమాదేవి,కాయితోజు ధనలక్ష్మి,శ్యామల స్వప్న,కొయ్యడి హరిణి,గంజి కవిత తదితరులురూ.70 వేలు సమకూర్చుకున్నారు.గురువారం అంతర్జాతీయ ఫ్రెండ్షిప్ డే పురస్కరించుకొని స్వర్గీయ సురేష్ కుటుంబానికి సంబంధించిన నగదును అందజేశారు. అంతకుమునుపు సురేష్ చిత్రపటానికి మిత్రులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఈ దుఃఖ కష్ట సమయంలో మనోధైర్యాన్ని కోల్పోవద్దని తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చిత్రపటం వద్ద స్నేహితుని జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ నీతో కలిసి చదువుకున్న రోజుల్లో ఆడుకున్న ఆటలు, మాట్లాడుకున్న మాటల జ్ఞాపకాలను మరువలేక పోతున్నాం భావోద్వేగానికి గురయ్యారు.

