మరోమారు మానవత్వం చాటిన సీతలే రమేష్.
పలువురి చొరవతో బాధితులకు 24 వేలు చేయూత.
ఆపదలలో ఉన్నవారికి అండగా నిలుస్తున్న సీతాలే రమేష్.
కోటగిరి/ప్రజావాణి:-కోటగిరి మండల కేంద్రానికి చెందిన పాల సావిత్రి,పోశెట్టి దంపతులు జులై 19న నిజామాబాద్ నుండి కోటగిరికి బైక్ పై వస్తుండగా మోస్రా వద్ద మినీ వ్యాన్ ఢీకొట్టింది.దీంతో తీవ్రంగా గాయపడిన వారిని నిజామాబాద్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.చికిత్సకు రూ.2 లక్షల వరకు ఖర్చు కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి.ఈ విషయం తెలుసుకున్న స్వచ్ఛంద సేవకులు డాక్టర్ సీతలే రమేష్ తన వాట్సాప్ ద్వారా పలువురికి విజ్ఞప్తి చేసి రూ. 24 వేలు విరాళాలు సేకరించారు.చికిత్స పొందుతూ సావిత్రి జూలై 26న మృతి చెందడంతో సేకరించిన మొత్తాన్ని ఆమె భర్త పాల పోశెట్టి,పిల్లలకు అందజేశారు.అందుకు కుటుంబ సభ్యులు డాక్టర్ సీతలే రమేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పందిముక్కుల సాయిలు,దత్తు పటేల్, సున్నం రాజు,సుధాకర్ రెడ్డి,పాల పోశట్టి ఆయన కుటుంబ సభ్యులు,బంధువులు,తదితరులు పాల్గొన్నారు




