📄 ePaper
Monday, July 27, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriఎదులాబాద్ డివిజన్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్

ఎదులాబాద్ డివిజన్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, జూలై 27: మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఘట్‌కేసర్ సర్కిల్ ఎదులాబాద్ 7వ డివిజన్‌లోని ఘనపురం, లింగాపురం గ్రామాల్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, ఎదులాబాద్ 7వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు సామల అమరేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించి, ఓటరు వివరాలను సకాలంలో నమోదు చేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా వేముల మహేష్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బూత్ స్థాయి ప్రతినిధులు (బీఎల్‌ఏలు), బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రతి అర్హుడైన ఓటరికి ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతి ఓటరు తన ఓటు హక్కును పరిరక్షించుకునేందుకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో తప్పనిసరిగా తన వివరాలను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు నానావత్ రూప్‌సింగ్ నాయక్, వేముల మమత గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాయరు విశ్వనాథం, మాజీ ఉపసర్పంచులు వేముల సత్తయ్య గౌడ్, వేముల పరమేష్ గౌడ్, మాజీ బ్యాంకు డైరెక్టర్ ఉదయ్‌కుమార్ రెడ్డి, ఘనపురం గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వేముల రాజు గౌడ్, మాజీ వార్డు సభ్యులు గుర్జకుంట నర్సింహా, మెట్టు రమేష్, వేముల శంకర్ గౌడ్, నానావత్ సురేష్ నాయక్, బర్ల అనిత, మాజీ కో-ఆప్షన్ సభ్యురాలు పైళ్ల లత రెడ్డి, నాయకులు పైళ్ల జంగారెడ్డి, పూస రమేష్, బీఎల్‌ఓలు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular