📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadయోగాలో మోహన్ కృష్ణ గౌడ్ కు గోల్డ్ మెడల్

యోగాలో మోహన్ కృష్ణ గౌడ్ కు గోల్డ్ మెడల్

📰 Generate e-Paper Clip

‘యోగా’లో”మోహన్ కృష్ణ గౌడ్”కు గోల్డ్ మెడల్
రాష్ట్ర పోటీలకు ఎంపికైనట్లు ప్రకటించిన జిల్లా ప్రెసిడెంట్ పుష్పలీల.
జీవనక్రియలో భాగం కావాలి: అవార్డు గ్రహీత మోహన్ కృష్ణ గౌడ్
ప్రజావాణి,నెల్లికుదురు: యోగాసనాల పోటీలలో కారంగుల మోహన్ కృష్ణ గౌడ్ బంగారు పతకం పొంది అపూర్వ ఘనత సాధించారు. మహబూబాబాద్ జిల్లాలో జిల్లా స్థాయి యోగాసన కాంపిటేషన్ పోటీలు 2026 జమాండ్ల పల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ లో నిర్వహించారు. సంబంధిత పోటీలలో మరిపెడ మండలం తాళ్ల ఊకల్ గ్రామానికి చెందిన కారంగుల మోహన్ కృష్ణ గౌడ్ పాల్గొని యోగాసనాలలో అసాధారణ ప్రతిభ కనబరిచి జిల్లా ప్రథమ స్థానం కైవసం చేసుకొని గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. దీంతో యోగాసన స్పోర్ట్స్ మానుకోట జిల్లా అధ్యక్షురాలు తూణం పుష్పలీల విజేత మోహన్ కృష్ణ గౌడ్ కు గోల్డ్ మెడల్ మెడలో వేసి ప్రశంసిస్తూ సర్టిఫికెట్ అందజేశారు. అనంతరం జిల్లాలో నెంబర్ వన్ గా నిలిచిన మోహన్ కృష్ణ గౌడ్ ను రాష్ట్రస్థాయి యోగాసనా కాంపిటీషన్ కు ఎన్నికైనట్లు జిల్లా ప్రెసిడెంట్ తూణం పుష్పలీల ప్రకటించారు.

‘యోగ’ జీవనక్రియలో భాగం కావాలి..
మోహన్ కృష్ణ గౌడ్
యోగ ప్రతి వ్యక్తి జీవనక్రియలో భాగం కావాలని, అప్పుడే సంపూర్ణ ఆరోగ్యం చేకూరి ఆరోగ్య భారత్ సాకారమవు తుందని గోల్డ్ మెడల్ గ్రహీత మోహన్ కృష్ణ గౌడ్ అన్నారు.ఎంతో మంది ప్రాచీన భారత ఋషులు,ధ్యానులు అనుభవపూర్వకంగా ఆరోగ్యం కోసం అందించిన యోగ పట్ల నిర్లక్ష్యం వహించవద్దని తెలిపారు. యోగాను ఐక్యరాజ్యసమితితో అంతర్జాతీయదినోత్సవం గా ప్రకటింప చేయించి ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తం చేయడం ప్రపంచ ప్రజల ఆరోగ్య పరక్షణ కోసమే అన్నారు. తాను బీటెక్ చదువుతున్నప్పటికీ యోగ పట్ల ఆసక్తితోనే నిత్యం యోగాసనాల తో పాటు,ప్రాణాయామం
చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఒత్తిడి,అలసట లేకుండా నిత్యం ఉత్సాహాన్ని పొందుతున్నట్లు చెప్పారు.యోగాను విద్యార్థులు,యువకులు,మధ్య వయస్కులు,వృద్ధులు అనే తారతమ్యం లేకుండా అందరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. కాగా యోగాలో గోల్డ్ మెడల్ సాధించడం పట్ల మోహన్ కృష్ణ గౌడ్ స్వగ్రామం తాళ్లఊకల్ తో పాటు మరిపెడ మండలంలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనల వెల్లువ కొనసాగిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.