📄 ePaper
Monday, July 27, 2026
📄 ePaper
HomeతెలంగాణWarangalమాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం నిలకడ

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం నిలకడ

📰 Generate e-Paper Clip

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం నిలకడ

చెన్నారావుపేట జూలై 26 ప్రజావాణి

బిఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండె పోటుతో ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఎప్పటికప్పుడు వివరాలు ఆరా తీశారు. సుదర్శన్ రెడ్డికి అత్యుత్తమ వైద్యం అందేలా స్వయంగా వెంట ఉండి పర్యవేక్షించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావులకు సూచించారు. కుటుంబ సభ్యులతో పాటు వైద్యులతో కేసీఆర్ మాట్లాడి చికిత్స వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular