📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMancherialపర్యటనలు కాదు బకాయిలు చెల్లించాలి

పర్యటనలు కాదు బకాయిలు చెల్లించాలి

📰 Generate e-Paper Clip

*పర్యటనలు కాదు బకాయిలు చెల్లించాలి*

*బకాయిలు ఇప్పించకుండా పర్యటనలతో కాలం వెలదీస్తున్న మంత్రులు*

*ఎస్సిఈయు (సిఐటియు) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మంద నర్సింహారావు, తుమ్మల రాజారెడ్డి*

* *మన ప్రజావాణి* మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- జూలై 26

సింగరేణి సంస్థకు రావాల్సిన బకాయిలు ఇప్పించే ప్రయత్నం చేయకుండా మంత్రుల పర్యటనలతో కాలం గడుపుతున్నారని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షుడు మంద నర్సింహారావు, ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి లు ఆరోపించింది. ఆదివారం జిల్లాలోని శ్రీరాంపూర్‌ లో నిర్వహించిన యూనియన్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈసందర్భంగా నర్సింహారావు, రాజారెడ్డి లు మాట్లాడుతూ, ఇటీవల సింగరేణిలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లు సింగరేణిలో పర్యటనలు చేస్తున్నారే తప్ప సంస్థకు రావాల్సిన బకాయిలు ఇప్పించే ప్రయత్నాలు చేయకుండా సంస్థను ఆర్థికంగా నష్టం చేస్తున్నారని ఆరోపించారు. పెండింగ్ లో ఉన్న కొత్త గనులకు అనుమతుల కొరకు ఒత్తిడి చేసి కొత్త గనులు సాధించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రజా ప్రతినిధులు డిపెండెంట్ లకు ఆఫీస్ ఆర్డర్ లెటర్లు మార్చి వరకే ఇవ్వడం వలన మిగిలిన వారు ఎదురు చూస్తున్నారని, వారికి, విజిలెన్స్ విచారణల పేరిట ఆపిన డిపెండెంట్ లకు వెంటనే ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా కాకుండా యాజమాన్యమే ఆఫీస్ ఆర్డర్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెడికల్ బోర్డు ప్రతి నెల నిర్వహించకపోవడంతో, వివిధ కారణాల వలన బోర్డు కు దరఖాస్తు చేసుకున్న వారిని నిరాశకు గురిచేయకుండా, ఇన్ వ్యాలిడేషన్ శాతం పెంచాలని,మరి కొందరిని ప్రతీ నెల, 2 నెలలు అంటూ సర్ఫేస్ ఇస్తూ కాలం గడపకుండా వారి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బోర్డులో సరియైన నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అల్లి రాజేందర్, బ్రాంచ్ కార్యదర్శి కస్తూరి చంద్రశేఖర్, నాయకులు నరేడ్ల వెంకట రెడ్డి, పేరుక సదానందం లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.