📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణWarangalగ్రానైట్ బండలు దింపుతూ ప్రమాదం: ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలు

గ్రానైట్ బండలు దింపుతూ ప్రమాదం: ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలు

📰 Generate e-Paper Clip

గ్రానైట్ బండలు దింపుతూ ప్రమాదం: ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలు

చెన్నారావుపేటజూలై 22 ప్రజావాణి

వరంగల్ జిల్లా నెక్కొండ మండలం చిన్న కోర్పోలులో బొలెరో వాహనం నుండి గ్రానైట్ బండలు దింపుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చెన్నారావుపేట మండలం రామన్నకుంట తండాకు చెందిన ముగ్గురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఇస్లావత్ మోహన్ కాలు విరగ్గా, రామచంద్రు, భాస్కర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వైనాల నాగరాజు, ప్రవీణ్ వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.