📄 ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
HomeతెలంగాణMancherialఇందారంలో సింగరేణి-ఎస్టీపీపీ ఉచిత వైద్య శిబిరం

ఇందారంలో సింగరేణి-ఎస్టీపీపీ ఉచిత వైద్య శిబిరం

📰 Generate e-Paper Clip

జైపూర్ (ఇందారం),జూలై22, ప్రజావాణి:

సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఆధ్వర్యంలో జైపూర్ మండలంలోని ఇందారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సింగరేణి ఉన్నతాధికారుల సూచనల మేరకు, ప్లాంట్ ప్రభావిత గ్రామాల ప్రజల ఆరోగ్య ప్రయోజనాల కోసం ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు ఈడీ శ్రీ సిహెచ్. చిరంజీవి తెలిపారు. ఉచిత వైద్య శిబిరాల ద్వారా ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకొని, ముందస్తుగా వ్యాధి నివారణ చర్యలు చేపట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ శిబిరంలో గ్రామానికి చెందిన 57 మంది మహిళలు, వృద్ధులు, ఇతర రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, మందులను పంపిణీ చేశారు

.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular