📄 ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
HomeతెలంగాణMancherialఐఎఫ్ఎస్ విజేత శశాంక్‌కు ఘన సన్మానం

ఐఎఫ్ఎస్ విజేత శశాంక్‌కు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

కుందారం,జూలై22,ప్రజావాణి:

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) 2025 ఫలితాల్లో ఆల్ ఇండియా 78వ ర్యాంకు, తెలంగాణ రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన దహగామ శశాంక్‌ను బుధవారం కుందారం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా సన్మానించారు. ఛత్రపతి శివాజీ సేన సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు కలిసి ఈ చిరు సన్మాన సభను నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ, శశాంక్ సాధించిన విజయం దేశ స్థాయిలో గ్రామానికి మంచి పేరు తెచ్చిపెట్టిందని, పట్టుదల, కృషి ఉంటే సాధారణ కుటుంబం నుండి కూడా అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చని యువతకు స్ఫూర్తిగా నిలిచాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుక్కల వినోద, ఉప సర్పంచ్ కోల శ్రీనివాస్, చెప్యాలా మధుసూదన్ రావు, మధుమోహన్ రావు, ఛత్రపతి సేన సభ్యులు పల్లికొండ వెంకటేష్, ఉష్కమల్ల శేఖర్, వివిధ పార్టీల నాయకులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular