📄 ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఏ ఒక్కరి ఓటు కోల్పోకుండా జాగ్రత్తలు చేపట్టాలి. వికలాంగుల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ముత్తినేని.

ఏ ఒక్కరి ఓటు కోల్పోకుండా జాగ్రత్తలు చేపట్టాలి. వికలాంగుల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ముత్తినేని.

📰 Generate e-Paper Clip

ఏ ఒక్కరి ఓటు కోల్పోకుండా జాగ్రత్తలు చేపట్టాలి.

వికలాంగుల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ముత్తినేని.

హుజూర్నగర్ నియోజకవర్గ ప్రతినిధి, జులై 22, ప్రజావాణి:

ఓటరు జాబితాలో ఉన్న ఏ ఒక్కరి ఓటు కోల్పోకుండా జాగ్రత్తలు చేపట్టాలని రాష్ట్ర వికలాంగుల కమిషన్ చైర్మన్, సర్ ప్రోగ్రాం హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి ముత్తినేని వీరయ్య సూచించారు. సర్ ప్రోగ్రాం కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మాలోత్ మోతిలాల్ నాయక్ నేతృత్వంలో బుధవారం పాలకవీడు మండలంలోని కల్మెట తండా, రావిపాడు, జాన్ పహాడ్, మహంకాళి గూడెం తదితర గ్రామాలలో ఎన్యుమరేషన్ ఫారాల తిరిగి సేకరణ, డిజిటలైజేషన్ కార్యక్రమాలపై బిఎల్వోల తో మాట్లాడి ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. రాష్ట్ర భారీ నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉంటూ ఎన్యుమరేషన్ కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొనాలని కోరారు. అవగాహన లేని ఓటర్లను చైతన్య పరుస్తూ ఇంటింటికి పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాలను నింపి బిఎల్ఓ లకు తిరిగి అందించేందుకు సహాయపడాలన్నారు. లేనిచో అర్హులైన ఓటర్ సైతం ఓటు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఆగస్టు 3 లోగా డిజిటలైజేషన్ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. ఆయన వెంట శూన్యపాడ్, మహంకాళి గూడెం, రావిపాడు, కల్మట తండా గ్రామాల సర్పంచులు నీమానాయక్, పిడమర్తి దాసు, సుశీల ఏసు, చరణ్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శోభన్, పిడమర్తి ప్రేమ్ కుమార్, దావీదు , రాము సైదా వీరన్న తదితరులున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular