📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్"ఎల్‌నీనో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి"- ఇంకుడు గుంతలు, ఫామ్...

“ఎల్‌నీనో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి”- ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్ల ఏర్పాటుతో నీటి సంరక్షణ సాధ్యం

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి,జూలై 20 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని రేగులపల్లి గ్రామంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఎల్‌నీనో ప్రభావం నేపథ్యంలో గ్రామ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఎల్‌నీనో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నందున రైతులు వరి సాగును తగ్గించి ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి రైతులు తమ పొలాల్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవడంతో పాటు ఫామ్ పాండ్లు (ఫార్మ్ పాండ్స్ ) ఏర్పాటు చేసుకోవాలని అవగాహన కల్పించారు.గ్రామ సభలో నీటి సంరక్షణ, పంటల మార్పిడి, ప్రభుత్వ వ్యవసాయ పథకాలపై రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి మండల స్పెషల్ ఆఫీసర్ గౌడ్, ఎంపీడీఓ ప్రవీణ్, ఏఓ (వ్యవసాయ శాఖ),ఏపీఎం పర్శరాముల,సర్పంచ్ జంగిలి లక్ష్మి,పంచాయతీ కార్యదర్శి తిరుపతి తదితర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.