📄 ePaper
Saturday, July 18, 2026
📄 ePaper
Homeతెలంగాణబాధిత కుటుంబానికి అండగా ఉంటాం శాపురం నరసింహారెడ్డి

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం శాపురం నరసింహారెడ్డి

📰 Generate e-Paper Clip

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: శాపురం నరసింహారెడ్డి

 

తెల్లాపూర్, జూలై 18 (ప్రజావాణి): సంగారెడ్డి జిల్లా ముత్తంగి డివిజన్ పరిధిలోని కర్దనూర్ గ్రామానికి చెందిన తన్నీరు బాలయ్య మృతితో ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాపురం నరసింహారెడ్డి శనివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి తన స్వంత నిధుల నుంచి రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తాను సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు.

అనంతరం తన్నీరు బాలయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన శాపురం నరసింహారెడ్డి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రాంప్రసాద్, సుభాష్ గౌడ్‌తో పాటు పలువురు గ్రామస్థులు పాల్గొని, తన్నీరు బాలయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular