రూరల్ ఎంప్లాయిమెంట్ అండ్ అగ్రికల్చర్ ఫార్మా డెవలప్మెంట్ ట్రస్ట్
ప్రజావాణి ప్రతినిధి బీర్కూర్ : రూరల్ ఎంప్లాయిమెంట్ అండ్ అగ్రికల్చర్ ఫార్మా డెవలప్మెంట్ ట్రస్ట్ఆధ్వర్యంలో గ్రామీణాభివృద్ధి, స్వచ్ఛంద సేవా సంస్కృతి, యువశక్తి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో “టైం బ్యాంకింగ్” పైలెట్ ప్రాజెక్టులో భాగంగా “మన గ్రామం – మన సేవ” కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా బీర్కూర్ మండలంలోని బీర్కూర్, మల్లాపూర్, కిష్టాపూర్, చించోలి, దామరంచ, వీరాపూర్ గ్రామపంచాయతీల సర్పంచులకు టైం బ్యాంకింగ్ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ ప్రాజెక్టు వివరాలతో కూడిన వినతిపత్రాలను అందజేశారు.
టైం బ్యాంకింగ్ ద్వారా ప్రతి వ్యక్తిలోని సమయం, ప్రతిభ, జ్ఞానం, నైపుణ్యం, సేవాభావాన్ని సమాజాభివృద్ధికి వినియోగించడమే ప్రధాన లక్ష్యం. నిరుద్యోగ యువత, మహిళలు, విద్యార్థులు, స్వచ్ఛంద సేవకులు ఈ కార్యక్రమంలో భాగస్వాములై గ్రామాభివృద్ధికి సేవలందించాలని ట్రస్ట్ పిలుపునిచ్చింది.
ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అనుభవ ధృవీకరణ పత్రాలు, గ్రేడింగ్ విధానం అందించడంతో పాటు ప్రతిభ కనబరిచిన వారికి గ్రామ, మండల కోఆర్డినేటర్లుగా నాయకత్వ అవకాశాలు కల్పించబడతాయి. అలాగే నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంపొందించి భవిష్యత్తు ఉపాధి అవకాశాలకు ఉపయోగపడే అనుభవాన్ని అందిస్తుంది.
గ్రామాభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న “మన గ్రామం – మన సేవ” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు మామిడి సాయిబాబా, ప్రధాన కార్యదర్శి కత్తి గోపి, ట్రస్ట్ సభ్యులు ఓం ప్రకాష్ మరియు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
రూరల్ ఎంప్లాయిమెంట్ అండ్ అగ్రికల్చర్ ఫార్మా డెవలప్మెంట్ ట్రస్ట్


