రూరల్ ఎంప్లాయిమెంట్ అండ్ అగ్రికల్చర్ ఫార్మా డెవలప్మెంట్ ట్రస్ట్ ప్రజావాణి ప్రతినిధి బీర్కూర్ : రూరల్ ఎంప్లాయిమెంట్ అండ్ అగ్రికల్చర్ ఫార్మా డెవలప్మెంట్ ట్రస్ట్ఆధ్వర్యంలో గ్రామీణాభివృద్ధి, స్వచ్ఛంద సేవా సంస్కృతి, యువశక్తి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో "టైం బ్యాంకింగ్" పైలెట్ ప్రాజెక్టులో భాగంగా "మన గ్రామం – మన సేవ" కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బీర్కూర్ మండలంలోని బీర్కూర్, మల్లాపూర్, కిష్టాపూర్, చించోలి, దామరంచ, వీరాపూర్ గ్రామపంచాయతీల సర్పంచులకు టైం బ్యాంకింగ్ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ ప్రాజెక్టు వివరాలతో కూడిన వినతిపత్రాలను అందజేశారు....