📄 ePaper
Sunday, July 19, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriపోచారం 8వ డివిజన్‌లో కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ, ఎస్‌ఐఆర్ ఓటర్ అవగాహన కార్యక్రమం

పోచారం 8వ డివిజన్‌లో కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ, ఎస్‌ఐఆర్ ఓటర్ అవగాహన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, జూలై 17: పోచారం 8వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం చౌదరిగూడ, మక్తా, ప్రతాప్‌సింగారం, ముత్వెల్లిగూడ, కాచవాణి సింగారం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణతో పాటు ఎస్‌ఐఆర్ ఓటర్ అవగాహన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ మాజీ శాసనసభ్యులు మలిపెద్ది సుధీర్ రెడ్డి హాజరయ్యారు.

పోచారం 8వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రె రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జెండాలను ఆవిష్కరించి పార్టీ బలోపేతంపై నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కర్రె రాజేష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయడం ప్రతి కార్యకర్త బాధ్యత అని అన్నారు. పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తలంతా ఐక్యంగా, అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించి అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పోచారం డివిజన్ మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కర్రె జంగమ్మ, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇటిక్యాల కృష్ణారెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి మెట్టు గణేష్ యాదవ్, మాజీ ఎంపీటీసీ నర్రి శ్రీశైలం, ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు ఎర్ర రాజు, మాజీ మహిళా అధ్యక్షురాలు ఎర్ర మాధవి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ కుమార్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, బీఎల్‌ఏలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular