పోచారం 8వ డివిజన్‌లో కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ, ఎస్‌ఐఆర్ ఓటర్ అవగాహన కార్యక్రమం
ఘట్‌కేసర్, జూలై 17: పోచారం 8వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం చౌదరిగూడ, మక్తా, ప్రతాప్‌సింగారం, ముత్వెల్లిగూడ, కాచవాణి సింగారం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణతో పాటు ఎస్‌ఐఆర్ ఓటర్ అవగాహన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ మాజీ శాసనసభ్యులు మలిపెద్ది సుధీర్ రెడ్డి హాజరయ్యారు. పోచారం 8వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రె రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జెండాలను ఆవిష్కరించి పార్టీ బలోపేతంపై నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు....