📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్వైసీపీ నాయకుల అండతో భూ ఆక్రమణ: ఎస్ఐ యోగేంద్ర పక్షపాత వైఖరిపై బాధితుల ఆవేదన

వైసీపీ నాయకుల అండతో భూ ఆక్రమణ: ఎస్ఐ యోగేంద్ర పక్షపాత వైఖరిపై బాధితుల ఆవేదన

📰 Generate e-Paper Clip

కాశినాయన జూలై 16 ప్రజావాణి మండల పరిధిలోని కత్తెరగండ్ల పంచాయతీకి చెందిన చెన్నవరం గ్రామంలో అధికార పార్టీ నాయకుల అండదండలతో పేద రైతుల భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది.బాధితులు తమకు న్యాయం చేయాలని స్థానిక నరసాపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐ యోగేంద్రకు ఫిర్యాదు చేసినప్పటికీ,ఆయన పట్టించుకోకపోగా ఆక్రమణదారులకే కొమ్ముకాస్తున్నారని బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బాధితులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నవరం గ్రామంలోని సర్వే నెంబర్ 1640 లో మొత్తం రెండు ఎకరాల 85 సెంట్ల విస్తీర్ణం కలిగిన భూమి ఉంది. ఈ భూమిపై గ్రామానికి చెందిన రైతులు పుల్లూరు పెద్ద ఖాజావల్లి,మన్యం సిద్ధారెడ్డి,చెన్నుపల్లె వెంకటరెడ్డి,అసనయ్య,మరియు పోతుగంటి రసూలమ్మలకు చట్టబద్ధమైన హక్కులు,యాజమాన్య పత్రాలు ఉన్నాయి.ఎన్నో ఏళ్లుగా వారు ఈ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.అయితే,వీరిలో ఒకరైన మన్నెం సిద్ధారెడ్డి అనే వ్యక్తి మిగిలిన రైతుల స్థలాలపై కన్నేసి,ముఖ్యంగా పుల్లూరు పెద్ద ఖాజావల్లికి చెందిన భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. పొలాన్ని ఇష్టానుసారంగా తవ్వేస్తూ,సరిహద్దులను చెరిపేస్తూ దౌర్జన్యానికి దిగారు.దీనిని ప్రశ్నించిన బాధితులను తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించినట్లు సమాచారం రాజకీయ సిఫార్సులకే లొంగిన పోలీస్ యంత్రాంగం:తమ భూమిని కాపాడుకునేందుకు బాధితుడు పుల్లూరు పెద్ద ఖాజావల్లి నరసాపురం పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ యోగేంద్రకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.చట్ట ప్రకారం ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.అయితే,అధికార వైసీపీ నాయకుల నుంచి వచ్చిన సిఫార్సుల కారణంగా ఎస్ఐ ఈ ఫిర్యాదును పూర్తిగా బుట్టదాఖలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులు.ఆక్రమణదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ,కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వారు వాపోతున్నారు.
సమాధానం దాటవేస్తున్న ఎస్ఐ:
ఈ వివాదంపై మరియు బాధితుల ఆరోపణలపై వివరణ కోరేందుకు పత్రికా విలేకరులు నరసాపురం ఎస్ఐ యోగేంద్రను సంప్రదించగా,ఆయన బాధ్యతారహితంగా వ్యవహరించారు.విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేస్తూ,పొంతన లేని సమాధానాలు ఇచ్చారు.పోలీసుల ఈ తీరు చూస్తుంటే ఇక్కడ చట్టం కన్నా రాజకీయ సిఫార్సులకే ఎక్కువ విలువ ఇస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.రాజకీయ బలంతో పేద రైతుల పొలాలను లాక్కుంటుంటే చూస్తూ ఊరుకోబోమని బాధితులు స్పష్టం చేశారు. స్థానిక పోలీసులు న్యాయం చేయని పక్షంలో జిల్లా ఎస్పీ మరియు ఉన్నతాధికారులను ఆశ్రయిస్తామని తెలిపారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ భూ ఆక్రమణ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి,ఎస్ఐ యోగేంద్ర పక్షపాత వైఖరిపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు వారి భూమిని దక్కేలా చూసి న్యాయం చేయాలని రైతులు మరియు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.