వైసీపీ నాయకుల అండతో భూ ఆక్రమణ: ఎస్ఐ యోగేంద్ర పక్షపాత వైఖరిపై బాధితుల ఆవేదన

కాశినాయన జూలై 16 ప్రజావాణి మండల పరిధిలోని కత్తెరగండ్ల పంచాయతీకి చెందిన చెన్నవరం గ్రామంలో అధికార పార్టీ నాయకుల అండదండలతో పేద రైతుల భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది.బాధితులు తమకు న్యాయం చేయాలని స్థానిక నరసాపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐ యోగేంద్రకు ఫిర్యాదు చేసినప్పటికీ,ఆయన పట్టించుకోకపోగా ఆక్రమణదారులకే కొమ్ముకాస్తున్నారని బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బాధితులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నవరం గ్రామంలోని సర్వే నెంబర్ 1640 లో మొత్తం రెండు ఎకరాల 85 సెంట్ల విస్తీర్ణం కలిగిన భూమి...