📄 ePaper
Saturday, July 18, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్రజకులను SC జాబితాలో చేర్చాలి,జిల్లా రజక సంఘం అధ్యక్షులు రవి

రజకులను SC జాబితాలో చేర్చాలి,జిల్లా రజక సంఘం అధ్యక్షులు రవి

📰 Generate e-Paper Clip

ప్రొద్దటూరు జూలై 16 ప్రజావాణి పట్టణములో రాష్ట్ర విద్యా మరియు IT శాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారిని అఖిలభారత ధోబి మహాసంగ్రాష్ట్ర ఉపాధ్యక్షులు గోవిందాయపల్లె కృష్ణయ్య మరియు ప్రతినిధి బృందం కలిసి వినతి పత్రము సమర్పించడమైనది.ఈ సందర్భముగా రజకులను SC జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేయడమైనది.దేశము లో18 రాష్ట్రాలలో రజకులు SCలుగా గుర్తించడము వలన ఆర్థికంగా, సామాజికంగా మరియు రాజకీయముగా అభివృద్ధి చెందియున్నారు ,అదే విధముగా ఉమ్మడిఆంధ్రప్రదేశ్ లోని రజకులను SC లు గుర్తించాలని గత 40 సంవత్సరాలుగా అనేక రకాలుగా శాంతి యుత పోరాటాలు చేస్తూనేఉన్నాము . కావున మాకోరిక మన్నించి రజకులను SC జాబితాలో చేర్చాలని కోరడమైనది రజకులకు రక్షణ చట్టము అమలుచేయాలి .రజక వృత్తి ఫై ఆధార పడి జీవిస్తున్న 50 సంవత్సరాలు దాటిన వారికి పింఛను వసతి కల్పించగలరు .రజకులకు దేవాదాయ శాఖా నుండి ప్రతి దేవాలయము నందు రజకునికి శాశ్విత ఉద్యోగమూ కల్పించాలి.కడప జిల్లాలో రజకులకు స్థానిక సంస్థలలో మరియు కార్పొరేషన్ లో నామినేట్ పదవులు ఏర్పాటు చేయగలరని, త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రజకులకు ప్రాధాన్యత ఇవ్వాలని,అంతే కాకుండ ముఖ్యముగ రజకులను పార్టీ పదవులలో నియమించి రజకులకు గౌరవము కల్పించగలరని కోరడమైనది.ఈ కార్యక్రమములో జిల్లా రజక సంఘం అధ్యక్షులు చేలో రవి రజక సంఘము జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నప్ప లు పాల్గొన్నారు .

RELATED ARTICLES
- Advertisment -

Most Popular