📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriవిద్యుత్ సరఫరా అంతరాయం

విద్యుత్ సరఫరా అంతరాయం

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, జూలై 15: చెట్ల కొమ్మల కత్తిరింపు పనుల కారణంగా ఘట్‌కేసర్ సెక్షన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో రేపు (జూలై 16) విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 11 కేవీ చందుపట్లగూడ ఫీడర్ పరిధిలోని చందుపట్లగూడ, ఎదులాబాద్, కొత్తగూడ, పోతురాజుగూడ, మర్రిపల్లిగూడ గ్రామాలు, శ్రీరామ పౌల్ట్రీ, ఒమేగా కళాశాల, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కేవీ ఎదులాబాద్ వ్యవసాయ ఫీడర్ పరిధిలోని ఎదులాబాద్, కొత్తగూడ, పోతురాజుగూడ ప్రాంతాల వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు.

విద్యుత్ వినియోగదారులు అసౌకర్యానికి గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఘట్‌కేసర్ సెక్షన్ ఆపరేషన్ సహాయ ఇంజనీర్ పవన్ చంద్ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.