నరసాపురం (జులై 14 ప్రజావాణి) మండల కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సమావేశం మంగళవారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అన్వేష్ జిల్లా కమిటీ సభ్యులు ఎంబడి పోలయ్య మాట్లాడుతూ కులాంతర వివాహల బారిన పడిన యువతను తుద ముట్టిస్తున్న ఘటనలు అనేకం చూస్తూ ఉన్నామని పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నుంచి నేటి కమ్యూనిస్టుల వరకు కులాంతర వివాహాలను ప్రోత్సహించారని తెలిపారు. అంతిమయాత్రలోనూ దళితులకు అవహేళనే ఎదురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల స్మశానాలను పెత్తందారుల ఆక్రమణలో ఉన్నాయని చెప్పారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ డ్రగ్స్ కేసులో దొరికాడని, అటువంటివారిని వదిలేశారని పేర్కొన్నారు. మనుధర్మ శాస్త్రం ప్రకారం దళితులు తప్పు చేస్తే శిక్ష, పెత్తందారులు చేస్తే సత్కారమా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి పర్యటనకు జిల్లా అధికార యంత్రాంగం హాజరు కాదని, సుప్రీంకోర్టు జడ్జిపై ఓ మత దురహంకార న్యాయవాది బూటు విసిరేసే ధైర్యం మనుధర్మ శాస్త్రం నుంచే వచ్చిందని తెలిపారు. ఉద్యమాలతో పాటు సామాజిక ఉద్యమాలు చేపట్టడంలో భాగంగా కుల వివక్ష లేని సమాజం కోసం సామాజిక శంఖారావం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్న ప్రకృతి వనరుల దోపిడీ కొనసాగుతూ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్మాదం పెరగడానికి కూటమి సర్కార్ దోహదం చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వం కులాల పేరిట కార్పోరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా కుల వివక్షను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. కూటమి సర్కార్ దళితవాడలలో పాఠశాలలను రద్దు చేస్తుందని తెలిపారు.దళిత క్రైస్తవులకు రిజర్వేషన్స్ పై సుప్రీంకోర్టు తీర్పు చర్చనీయాంశంగా ఉందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను రాష్ట్రపతి సవరించి ఇవ్వాలని కోరారు. 1956లో సిక్కు దళితులు పోరాడి రిజర్వేషన్స్ సాధించుకున్నారని తెలిపారు. 1999లో వీపీ సింగ్ రిజర్వేషన్స్ ఇచ్చారని గుర్తు చేశారు. దళితులు మారితే రిజర్వేషన్స్ పోతాయని, బిసిలు ఓసీలు మారితే రిజర్వేషన్స్ పోవని పేర్కొన్నారు. దళితులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. జి.చంద్రశేఖర్, సిఐటియు జిల్లా ఈ నెల 15 లోపు మండల, పట్టణ కమిటీల సమావేశం ముగించాలి. 16 నుంచి 26 వరకు అధ్యయన యాత్రలు. 27 నుంచి 30 వరకు సచివాలయాల్లో వినతి పత్రాల అందజేత. ఆగస్టు 3,4 మండల కార్యాలయాల వద్ద ధర్నాలు. 15న సమైక్యత దినోత్సవం నిర్వహణ. 16 నుంచి 21 వరకు ప్రచార యాత్రలు.నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు వరికుంట్ల బాబు గుండ్లకుంట కిరణ్ బాల ఓబయ్య జీవన్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
కుల వివక్ష లేని సమాజ సాకారం కోసం యువత ఉద్యమించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జిల్లా అన్వేష్ కమిటీ సభ్యులు ఎంబడి పోలయ్య, పిలుపునిచ్చారు
0
10
- Advertisment -




