📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriజామా మసీదు కమిటీ ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్ కార్యక్రమం

జామా మసీదు కమిటీ ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్ పరిధిలోని జామా మసీదు కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు ఉత్సాహంగా పాల్గొని ఓటరు నమోదు, సవరణలు మరియు సంబంధిత వివరాలపై అవగాహన పొందారు.

జామా మసీదు కమిటీ అధ్యక్షుడు అన్నూ భాయ్, ప్రధాన కార్యదర్శి కుతుబ్ భాయ్ ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా షకీల్, షేక్ నజీర్, ఫిరోజ్ ఖాన్, మొహమ్మద్ నబీ తదితరులు పాల్గొని కార్యక్రమ నిర్వహణలో సహకరించారు.

అదేవిధంగా మొహమ్మదియా మసీదులో కూడా ఎస్‌ఐఆర్ కార్యక్రమం నిర్వహించి ఓటర్లకు అవసరమైన సూచనలు, అవగాహన కల్పించారు. ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలని, వివరాలలో మార్పులు ఉంటే సకాలంలో సవరించుకోవాలని కమిటీ సభ్యులు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.