📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKarimnagarలబ్ధిదారుల ఇంటి వద్దకే సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసి మానవీయత చాటిన ఎమ్మెల్యే

లబ్ధిదారుల ఇంటి వద్దకే సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసి మానవీయత చాటిన ఎమ్మెల్యే

📰 Generate e-Paper Clip

లబ్ధిదారుల ఇంటి వద్దకే సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసి మానవీయత చాటిన ఎమ్మెల్యే

* ప్రజల గడపలోనే ప్రజాప్రతినిధి

* హుజూరాబాద్‌లో పాడి కౌశిక్ రెడ్డి ప్రత్యేక ముద్ర

* ప్రజల కష్టసుఖాల్లో తోడుగా నిలవడమే ప్రజానాయకత్వమనే సందేశం

* ప్రతి కుటుంబాన్ని పేరుపేరునా పలకరించే నాయకత్వానికి ప్రజల ఆదరణ

* సంక్షేమం సేవ అందుబాటులో ఉండే రాజకీయానికి హుజూరాబాద్‌లో నిదర్శనం


జమ్మికుంటహుజూరాబాద్ జూలై 9 (ప్రజావాణి)

ప్రజాస్వామ్యంలో ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలను గుర్తు చేసుకునే నాయకులు ఒకవైపు ఉంటే, ప్రజల కష్టసుఖాల్లో ప్రత్యక్షంగా వారి గడపను తట్టే ప్రజాప్రతినిధులు మరోవైపుఉంటారుహుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల చేపట్టిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం అలాంటి ప్రజాకేంద్రిత రాజకీయానికి ఒక ఉదాహరణగా నిలిచిందిజమ్మికుంట పట్టణం, పెద్దంపల్లి గ్రామాల్లో అనారోగ్యం, ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొన్న లబ్ధిదారుల ఇళ్లకే స్వయంగా వెళ్లి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేయడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పడం ప్రజల్లో విశ్వాసాన్ని పెంచింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కేవలం ఫైళ్లకే పరిమితం కాకుండా నిజమైన లబ్ధిదారుల చేతికి చేరేలా కృషి చేయడం ప్రజాప్రతినిధి బాధ్యతను గుర్తు చేసిందిహుజూరాబాద్ నియోజకవర్గంలో పాడి కౌశిక్ రెడ్డి పేరు కేవలం ఒక ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా వినిపిస్తోందనే అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది. గ్రామాల్లోనైనా పట్టణాల్లోనైనా ప్రజలను పేరుపేరునా పలకరించడం వారి కుటుంబ పరిస్థితులను గుర్తుంచుకోవడం అవసరమైనప్పుడు వెంటనే స్పందించడం వంటి అంశాలు ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయిరాజకీయాల్లో విమర్శలు సహజమే. అయితే ప్రజల మధ్య నిరంతరం ఉంటూ సేవా కార్యక్రమాలతో విశ్వాసాన్ని సంపాదించుకున్న నాయకత్వాన్ని ప్రజలే అంచనా వేస్తారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు ప్రజలతో ఏర్పడిన అనుబంధం తాత్కాలిక రాజకీయ సమీకరణం కాదని, అది కాలక్రమేణా బలపడిన నమ్మకమనే భావన హుజూరాబాద్‌లో కనిపిస్తోంది.ప్రజా సంక్షేమం, అభివృద్ధి, అందుబాటులో ఉండే నాయకత్వం,ఈ మూడు అంశాలను సమన్వయం చేస్తూ ముందుకు సాగాలనే ప్రయత్నంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కొనసాగుతున్న తీరు నియోజకవర్గ రాజకీయాల్లో ప్రత్యేక చర్చకు దారితీస్తోంది ప్రజల గడప దాటిన నాయకత్వానికే ప్రజల గుండెల్లో స్థానం లభిస్తుందనే విషయాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.