📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్సింగరకొండ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం  వ్యక్తికి తీవ్ర గాయాలు

సింగరకొండ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం  వ్యక్తికి తీవ్ర గాయాలు

📰 Generate e-Paper Clip





సింగరి గుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు


మన ప్రజావాణి
చౌడేపల్లి: జూలై  08



అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలంలోని సింగరి గుంట సమీపంలోని సింగిరిగుంట రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పెద్దకొండమరి పంచాయతీ పరిధిలోని మల్కికోటూరు గ్రామానికి చెందిన జబీవుల (తండ్రి పేరు: మల్కి)ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్లు సమాచారం.

స్థానికుల కథనం ప్రకారం, జబీవుల సింగిరిగుంట రహదారిపై వెళ్తుండగా వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు.

సంఘటన స్థలానికి చేరుకున్న 108 అత్యవసర సేవల సిబ్బంది క్షతగాత్రుడికి ప్రాథమిక చికిత్స అందించి చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి పరిస్థితి విషమంగా ఉన్నట్లు గుర్తించి మెరుగైన వైద్యం కోసం మదనపల్లి ఏరియా ఆసుపత్రికి రెఫర్ చేశారు. ప్రస్తుతం ఆయనకు అక్కడ చికిత్స కొనసాగుతోంది.

ఈ ప్రమాదానికి కారణమైన వాహనం ఏదనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. స్థానికులు కూడా ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.