ధర్మపురి పట్టణ కేంద్రంలో అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు అరికిల్ల సతీష్ ఆధ్వర్యంలో ఆదివారం అంబేద్కర్ స్మరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఐ మహేష్.. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛను ప్రసాదించిన గొప్ప గ్రంథమని కొనియాడారు. చట్టాలను గౌరవిస్తూ, అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ధర్మపురిలో ఘనంగా అంబేద్కర్ స్మరణ: పాల్గొన్న ఎస్ఐ మహేష్
0
8




